15-Jan-2020, Wednesday, 7:00-8:00PM, EST (Telugu version available at the bottom of this page)
In S.V.Temple, Cary,NC (Srivaru Temple), 'Mokshotsavam' was planned 15th Jan2020 which includes 'Adyanana Utsavam/Paduka Utsavam'. I was meditating and volunteering while this event was in progress. After 30 minutes, I started seeing totally different images, which I never saw in my Meditation.
- 'Nammalwar' was Climbing steps towards 'Vaikuntam (Heaven)'
- From Vaikuntam (Heaven) GOD and GODDESSES welcoming him
- Vaishavites pouring Elixir continously on him
- Vaishnavites pouring Juices continously on him
- LORD Vishnu in Seshapanu and seeing 'Ramunaja'
- Both Ramunaja & Vishnu were very happy for Nammalwar
- He is the only one person lived with previous birth memories and traveled to 'Vaikuntam/Mokasham/Heaven' with physical Body.
Felt good energies and started to burst out. I was so excited, acted as security Guard (Vishwaksena) for LORD SriDevi, Bhudevi and Vishnu till they go back to Anathralyam and did a lot of volunteering to say vote of thanks to Supreme Lord.
Felt very emotional and Happy tears started floating ...
Thanks to Supreme GOD for choosing me for these experiences
Note : This picture drawn by Manasivini (My Daughter)
About Nammalwar :Nammazhwar (Tamil: Nammāḻwār) is one of the 12 alwar saints of TamilNadu,India who are known for their affiliation to the Vaishnava tradition of Hinduism.According to traditional scripture Nammalwar was born in 3059 BCE in Alwarthirunagiri.The word alwar means the one who dives deep into the ocean of the countless attributes of god. Finally after listening to the beautiful Paasurams of ThiruvaaiMozhi, Lord gives in. The Lord was so taken in by the Paasurams tha it is said Lord wanted to take NammAzhvaar to Vaikuntam in the same form.It was this body that rendered the beautiful Prabhandham to the world and hence I want to take you with me with your body itself' was Lord's View.
Sri Nathamunigal's Period
Sri Nathamunigal of the 7th century, the foremost Acharya resumed the Adyayan utsavam at Srirangam. He extended the practice of recitals to include all 4000 verses and made it 21-daycelebration. In the first ten days, Mudalayeeram (first 1000 verses) and Tirumangai Azhwars' Peria Tirumozhi are recited. In the second ten days, Thiruvaimozhi is recited culminating in Nammazhwar's Mokshotsavam on the 20th day. On the 21st day, Iyarpa is recited.
The recital of 4000 verses (Divya Prabhandham) in the presence of Lord before Nammazhwar's ascendance to the Celestial Abode of Srivaikuntam is celebrated as Adyayanautsavam.
**నా హృదయ వైకుంఠ యాత్ర*
15. January.2020, బుధవారం, 7.00 తో 8.00 pm మధ్యలో, North Carolina లోని వెంకటేశ్వరస్వామి గుళ్ళో "మోక్షోత్సవం" జర పబడే క్రమంలో అద్యానన / పాదుకా ఉత్సవం కూడా ఒక భాగం గా నిర్వహించబడుతుంది, ఆ దైవ కార్యక్రమంలో నేనూ పాల్గొనటం నాకు అత్యంత ఆనంద దాయకమైన విషయం. ఈ కార్యక్రమం లో భాగంగా నేను స్వచందంగా దైవ కార్యక్రమాన్ని నిర్వర్తించే పనిలో నిమగ్నమై ఉండగా, మొదటి 30 నిమిషాల తరువాత, నా ధ్యానం లో ఎన్నడూ గోచరించని దృశ్యాలను నేను చూడగలిగాను ,
*వైకుంఠ పురము నందు ఉన్న విష్ణు ఆరాధకులు వైకుంఠం నుంచి భూలోకానికి నిచ్చెన వేసినట్టుగా కనిపిస్తుండగా కారణ జన్ములైన నమ్మాళ్వార్ ఆ వైకుంఠ పురమును చేరుటకు ఆ నిచ్చెన మెట్లు ఎక్కటం నేను నా ధ్యాన ముద్ర లో చూడ గలగటం నాకు లభించిన పూర్వజన్మ వరప్రసాదంగా నేను భావిస్తున్నాను.
*.వైష్ణవ ఆరాధకులు నమ్మాళ్వార్ వారికి అమృతా అభిషేకం చేస్తూ వైకుంఠానికి ఆహ్వానం పలికారు.
*.ఆదిశే ష శయనుడై ఉన్న సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు , రామానుజుల వైపు వాలుకంట పరస్పరం చూసుకొని నమ్మాళ్వార్ రాకని వారి దివ్య దృష్టి తో కాంచి ఏంతో పరవసించారు
* నా ధ్యానం లో కనిపించిన ఈ యొక్క రామాను జు లతో కలిసి ఉన్న ఆదిశేషు డై కొలువుతీరిన శ్రీమన్నారాయణుడు శ్రీరంగంలో కొలువై ఉన్నాడు అన్న విషయం యొక్క ఆనందం నా హృదయ కెరటాన్ని తాకి ఆ తాకిన కన్నీరు నా చెంపలను తడిమింది.
*. శ్రీవారి ప్రియపరివారమందు ఒకరైన విష్వక్ సేనుల వారే ఈ జన్మలో నమ్మాళ్వార్ గా మానవ జన్మను పొంది శ్రివారిసేవలో తరించారని స్థల పురాణం గా పేరొందింది.
*. ప్రతి శిశువు మానవ జన్మ పొందిన తరువాత షట్ వాయువుల మాయ విడివడటం వలన ఆ పుట్టిన శిశువు రోదించటం జరుగుతుంది , కానీ నమ్మాళ్వార్ షట్ వాయువులను కమ్మిన మాయ పొరను స్మృతి పథం లో , స్మృతి పథం తో మానవ జన్మను కారణ జన్ము డి గా మలచు కొని భూమిపై మానవుడిగా నడయాడిన ఆళ్వారుల వారు*. భూలోకం లో మానుష్య జన్మను ఎత్తి, పూర్వజన్మ సుకృతం చే , మానుష్య రూపముతో వైకుంఠ పురము నందు ప్రవేశించ కలిగిన ఏకైక కారణ జన్మలు శ్రీ నమ్మాళ్వార్ గురువులు.*. ఈ ఘటన నన్ను, స్వామి వారు భూదేవి, శ్రీదేవి తో కూడి విశ్వక్షేనుల వారు శ్రీవారి సన్నిధిలో కాపలాదారుడిగా ఉండగా , ఆ దివ్య సందర్శనం ప్రత్యక్షంగా నా కళ్ళతో ,కళ్ళారా జరిగినట్లుగా చూడ గలగటం తో నేను శిలా ప్రతిమ నే అయ్యాను ,. మాటల్లో వర్ణింప లేని అత్యుత్సాహం పొందగలిగిన అదృష్టమ్ గా నా మనో ఫలకం పై ఆ ఘటనను ముద్రించుకొగలిగాను. శ్రీవారి శ్రీదేవి , భూదేవి తో కలిసి అంతరాలయంలో కి వెళ్లిపోయినతరువాత తరువాత కూడా నేను యాంత్రికంగా భక్తుల పట్ల నా బాధ్యత నిర్వర్తిస్తున్నా, ఆ దివ్య ఘటన నుంచి ఇహం లోకి రాలేక పోయాను. ఇది అంతా కేవలం విష్ణు లీల కాక మరేవిటి. సాక్ష్యాత్తు భగవంతుడే నన్ను ఎంచుకొని ఇలా అనుగ్రహి స్తూ నాకు వైకుంఠ దర్సనం కలిగించినందుకు అలా ఆనంద భాష్పలతో స్వామికి నా మనః కమలాలను స్వామి పాదాలకు ఆర్పించాను. నాలుగు వేదాలనూ రాసిన నమ్మాళ్వారు!
క్రీ.శ 6వ శతాబ్దం నాటికి అన్యమతాల ప్రభావంతోనూ, పరస్పర విరుద్ధమైన సంప్రదాయాలతోనూ భారతదేశంలోని ధార్మిక వ్యవస్థ అగమ్యగోచరంగా తయారైంది. అలాంటి వాతావరణంలో తిరిగి వైష్ణవ, శైవ భక్తి తత్వాన్ని ప్రచారం చేసే బాధ్యతతో జీవించినవారే ఆళ్వారులూ, నయనార్లూ! విష్ణుతత్వాన్ని ప్రచారం చేసిన ఆళ్వారులలో ప్రముఖులు ‘నమ్మాళ్వారు’. ఆశ్చర్యకరమైన ఆయన జీవిత విశేషాలలో కొన్ని…భక్తుల నమ్మకం ప్రకారం నమ్మాళ్వారు ఇప్పటి ‘ఆళ్వార్‌తిరునగరి’ అనే ప్రాంతంలో జన్మించారు. ఆళ్వారులందరిలోకీ రాశిలోనూ, వాసిలోనూ నమ్మాళ్వారు నుంచి వెలువడిన రచనలే ఎక్కువ. అలాంటి నమ్మాళ్వారు తన పదహారవ ఏట వరకూ అసలు మాట్లాడనేలేదట! మాట సంగతి అటుంచితే, పుట్టిన వెంటనే అందరి పిల్లల్లా ఏడవటం కానీ, పాలు తాగడం కానీ, కనీసం కళ్లు తెరవడం కానీ చేయలేదు. పిల్లవాడిలో ఎలాంటి ప్రతిస్పందనా కనిపించకపోవడంతో దాంతో పిల్లవాడి బాధ్యత ఆ భగవంతుడిదే అనుకున్నారు. తమ ఊరి దైవమైన ‘ఆదినాథర్’ పాదాల చెంత ఆ పిల్లవాడిని ఉంచారు. ఆశ్చర్యకరంగా అక్కడి నుంచి లేచి వెళ్లి, గుడి ఆవరణలో ఉన్న చింతచెట్టు వద్ద పద్మాసనం వేసుకుని ఉండిపోయాడు.
అలా పదహారు సంవత్సరాలపాటు నమ్మాళ్వారు ఆ చింతచెట్టు కిందనే తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. ఆ సమయంలో ఉత్తరాదిన తీర్థయాత్రలు చేస్తున్న మధురకవి అనే పండితునికి దక్షిణాది నుంచి ఒక వింత కాంతి కనిపించసాగింది. ఆ కాంతిని అనుసరిస్తూ వచ్చిన మధురకవికి, అది నమ్మాళ్వారు నుంచి వెలువడుతోందని తెలిసింది. ఆ యువకుడిలోని జ్ఞానాన్ని పరీక్షించాలనుకున్న మధురకవి, శాస్త్రాలలోనే అత్యంత క్లిష్టమైన ప్రశ్నలను సంధించాడు. వాటికి అద్భుతమైన జవాబులను ఇవ్వడం ద్వారా తన సుదీర్ఘమైన మౌనాన్ని విడిచారు నమ్మాళ్వారు. అప్పటి నుంచీ నమ్మాళ్వారుకి శిష్యునిగా మారి ఆయన చెంతనే ఉండిపోయారు మధురకవి. నమ్మాళ్వారు నోటి వెంటి ఆశువుగా వెలువడే పాశురాలను అక్షరబద్ధం చేస్తూ, వాటిలోని ఉదాత్త భావాలకు అనుగుణంగా జీవిస్తూ మధురకవి కాస్తా ‘మధురకవి ఆళ్వారు’గా మారిపోయారు.సంస్కృతంలోని నాలుగువేదాలకు ప్రతిరూపంగా తమిళంలో నాలుగు మహోన్నతమైన రచనలను చేశారు నమ్మాళ్వారు. తిరు విరుట్టం, తిరు అశీరియం, పెరియ తిరువందాడి, తిరువైమొళి అన్నవే ఆ నాలుగు గ్రంథాలు. వైష్ణవ దివ్య క్షేత్రాలైన 108 దివ్యదేశాలలో ఏ ఒక్కదానినీ నమ్మాళ్వారు చూసి ఉండలేదు. కానీ వాటన్నింటినీ ఆయన తన పాశురాలలో కళ్లకు కట్టినట్లుగా వర్ణించడం చూస్తే, ఆయన తన ధ్యానంలోనే వాటిని దర్శించారని తోస్తుంది. విష్ణుమూర్తి యొక్క సైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుని అవతారంగా నమ్మాళ్వారుని భక్తులు భావిస్తారు. తమిళనాట చాలా వైష్ణవాలయాలలో నమ్మాళ్వారుకు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. వీటన్నింటిలోకీ వైశాఖమాసంలో జరిగే గరుడసేవ ఉత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. తమిళనాడులోని తిరువన్వేలి- తిరుచెందూరుల మధ్య 9 ప్రముఖ వైష్ణవాలయాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ‘నవతిరుపతి’ అంటారు. వైశాఖమాసంలో జరిగే గరుడోత్సవంలో నమ్మాళ్వారు విగ్రహాన్ని పాడిపంటల మధ్య నుంచీ ఈ తొమ్మిది క్షేత్రాల దగ్గరకు తీసుకువెళ్తారు. ఇలా ఒకో క్షేత్రం వద్దకి చేరుకున్నప్పుడు ఆ ఆలయం మీద నమ్మాళ్వారువారు రాసిన పాశురాలను చదువుతారు.నమ్మాళ్వారు అతి చిన్న వయసులోనే పరమపదించారని చెబుతారు. వైష్ణవులకు పుణ్యప్రదమైన వైకుంఠ ఏకాదశినాడు నమ్మాళ్వారు నేరుగా వైకుంఠాన్ని చేరుకున్నారట. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వైకుంఠ ఏకాదశినాడు శ్రీరంగంలో గొప్ప ఉత్సవాన్ని జరుపుతారు. జీవించింది కొద్దికాలమే అయినా, వైష్ణవ భక్తిసాహిత్యంలో నమ్మాళ్వారు స్థానం అచిరకాలం నిలిచిపోయింది.
1000 సంవత్సరాలుగా భద్రపరచబడిన శ్రీ రామానుజాచార్యుల పవిత్ర శరీరమును శ్రీ రంగంలో ఎప్పుడైనా చూసారా?
వేదానికి సరైన అర్ధము చెప్పి, విశిష్టద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు ఆయన పరమపథం చెంది వెయ్యేళ్లు అయినా ఇప్పటికీ ఆ శరీరము భద్రపరిచి ఉండడం విశేషం.....
శ్రీ రామానుజచార్యులు....
భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి, వాటిలో తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి, ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరము
శ్రీరామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం, అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం, కొందరు శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు....పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజుల వారు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు, ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరము కనిపిస్తుంది, ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవము నిర్వహిస్తారు, ఆ సమయంలో కర్పూరము కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల వారి శరీరానికి పూస్తారు, అందువల్ల ఆయన శరీరము ఓ ఎర్రని వర్ణంలో విగ్రహములా మెరుస్తూ కనిపిస్తుంది, అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోళ్లను, మనం స్పష్టంగా గుర్తించవచ్చు, కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతముగా కనిపిస్తాయి... రామానుజాచార్యుల వారి గొప్పదనము:-రామానుజులు వారు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు, దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు వారు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు, ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు....
కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా? శివ రూపానిదా? అని వైష్ణవులు, శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు, తిరుమల స్వామి వారి గర్భాలయంలో శంఖు చక్రాలను ఉంచగా తెల్లవారి చూసే సరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమైనది, తిరుమల వెంకటేశ్వరుని నిత్య కైంకర్యాలను, సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారు....కొందరికే పరిమితమైన "అష్టాక్షరీ "ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియూర్ ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు, ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసి పుచ్చి.. తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు, ఇలా సమ భావన, సహ జీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు.....ప్రాచుర్యంలోకి రాని రహస్యం:-
క్రీస్తు శకం 11 - 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు, అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు, అయితే శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యుల దివ్య దేహాము అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది, కాబట్టి శ్రీరంగం పర్యటనకు మీరు వెళ్లినట్లయితే రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పక సందర్శించండి....
*ఓం నమో నారాయణాయ*
References
Disclaimer: Above few photos has taken from SVTNC temple website for better representation of the experience and will not be used for any commerical purpose