S.V. Temple, Cary, NC, Monday (14-Dec-2020) (Telugu version available at the bottom of this page)
This year (2020) Karthika Masam 5th Monday has occured dated on 14-Dec-2020. I started Meditating and obtained beautiful experiences as mentioned below.
I have started seeing/feeling this in my Meditation
1) Myself sitting infront of Siva Lingam right Next to Nandi
2) Siva Paravathi, Vigneswara, Kumaraswamy sat along with their vehicles (Mouse, Nandi, Tiger and Peacock) behind me to witness Abhishekam.This reminded me of Satyanarayana swamy pooja, how we invite all the parivaram
3) Entire Sivalokam has come here to witness abishekam
Śivaloka (शिवलोक, “Śiva’s world”).—There is a Silver platform (rājasa-maṇḍapa) there, an excellent river bed, and a bull in the form of penance”.It is the seat of salvation shining over and above everything. The holy centre is of the nature of extreme Bliss in as much as the primordial lovers, supremely Blissful, made that beautiful holy centre their perpetual abode”.
4) All the cows stood at the side of Siva Lingam to pour the Milk on him once abhishekam starts. Cows were eagerly waiting for the priest to invite them to pour the milk.
I was surprised to see this experience and felt thrilled. Witnessed entire abhishekam through Meditation and experienced Divine Energy.
Did not feel like opening my eyes for 30 minutes, totally forgot my existence and felt like I was in a different place with Blissful Energy.
Further research on this experience, understood this is the real story of "Dhenupureeswarar Temple, Madambakkam, Near Tamabaram, Chennai"
Dhenupureeswarar got his name because he gave moksha to a cow (Sanskrit: Dhenu).Sage Kapila is said to have been reborn as a cow for his sin of having improperly worshiped a Shiva lingam using his left hand. The cow continued to worship Shiva by pouring milk on a Shiva lingam buried in the ground. The cowherd initially punished the cow for wasting the milk, but when the villagers unearthed the Shiva lingam, Shiva appeared and granted moksha (liberation) to Kapila and forgave the cowherd who had mistreated him.
https://en.wikipedia.org/wiki/Dhenupureeswarar_Temple_(Madambakkam
References:
- http://www.teluguone.com/devotional/content/rudram-namakam-chamakam-lyrics-in-telugu-with-meaning-56-27346.html
- https://en.wikipedia.org/wiki/Dhenupureeswarar_Temple_(Madambakkam)
- http://www.maganti.org/PDFdocs/satyanarayanaswami.pdf
- https://stotranidhi.com/sri-satyanarayana-vrata-kalpam/
*ధ్యాన యాత్ర*
ఈ 2020 సంవత్సరం కార్తీకమాస చివరివారం నేను ధ్యానం లో ఉండగా అందమైన పవిత్ర మైన అనుభూతికి లోనయ్యాను దానిని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను, ధ్యానం లో నా శరీరం బహుతేలికై సూక్ష్మ మైపోయింది. ఎక్కడి అమెరికా లోని నార్త్ కారోలీనా ప్రాంతం, ఎక్కడి భారతదేశం లోని చెన్నై లోని పురాతనమైన దేవాలయం ఐన దేనుపూరేశ్వరర్ ఆలయం, శివానుగ్రంతో నా సూక్ష్మ శరీరంతో నేను ఆలయ దర్శనం చేసుకోవటం కేవలం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను,
నేనొక శివాలయం లో ఉన్నాను అదీ శివలింగం ఎదురుగా నందీశ్వరుడి కుడిప్రక్కగా, శివపార్వతులు వారి పరివారముతో కూడి వారి వారి వాహనాములతో కూడి నా వెనకనే నుంచున్న భావన నన్ను ఆవహించి ఉంది ఆ అనుభూతి నా సూక్ష్మ శరీరానికి తెలుస్తున్నది, జరుగుతున్న శివాభిషేకమునకు స్వయంగా వారే ప్రత్యక్ష సాక్షులు, అక్కడ జరుగుతున్న శివాభిషేకమునకు శివలోకం, పంచభూతాలే సాక్షిగా నిలిచారు.
శివలోకం : వెండితో తయారుచేయబడిన రాజస మంటపంలో శివసాన్నిద్యం మరియు మోక్షం కొరకు నీటిలో నిలబడి తపస్సు చేస్తున్న నందిని చూస్తే ఎలాంటి శివభక్తుడికైనా ఇదే కదా అన్నిటికన్నా ప్రధమమైన శాశ్వతమైన ఆనందాన్నిపొందే మోక్షమార్గం అనిపించక మానదు. నా సూక్ష్మ శరీరం తో అక్కడ జరిగే ప్రతీ సన్నివేశం నా మనోఫలకంపై భక్తిభావనతో పులకరింతకు లోనుఅయ్యాను.
అక్కడికి వచ్చిన గోవులన్నీ పూజారి యొక్క అనుమతికోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి తమ పొదుగుల పాలధారాలతో శివాభిషేకం చేయాలని, దైవానుగ్రహంతో నా ధ్యానం లోనే అక్కడ జరిగే శివాభిషేకాన్ని చూడటం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నే భావిస్తున్నాను మాటలకందని ఏదో శక్తి నా చుట్టూ ఉండటం నాలో ప్రవేశించటం ఆ మృగ్యమైన అనుభూతి నాకు తెలుస్తున్నది. బాహ్యప్రపంచాన్ని మరిచి ఆ ఆనందంలోనే 30 నిమిషాల వరకు ఉండిపోయాను ఆ అనుభూతిని నా మాటల్లో ఎలా వర్ణిస్థానంటే పూలదండలోని పువ్వులపరిమళాన్ని దారానికి అంటినట్టుగా, గంధపు చెట్ల నడుమ నడిచి బయటకు వచ్చినా ఆ సువాసన మనలను వదలనుట్టుగా.
*దేనుపూరేశ్వరర్ ఆలయ చరిత్ర :*
తరువాత నేను ఇంటర్నెట్ లో వెదకగా ఆ దేవాలయం నిజంగానే తమిళనాడులో కొలువై ఉందన్న నిజం నన్ను ఒక వింత అనుభూతిలో పడేసింది.
దేనుపూరేశ్వరర్ ఆలయాన్ని (తెనుపూరీశ్వరర్ గా )కూడా పిలుస్తారు, ఈ ఆలయం తమిళనాడులోని మాడంబక్కం అనే స్థలం నుంచి 24 KM దూరంలో ఉంది. ఈ ఆలయం 7వ శతాబ్దానికి చెందినది,954 - 971 A.D. చోలల వంశస్తులు (సుందర్ చోళన్, కుళ్ళోతుంగ చోళన్ ) మరియు విజయనగర చక్రవర్తుల కాలం ఈ దేవాలయాన్ని పరిరక్షించారు, ఈ ఆలయం ఎన్నో రాజగోపురాలకు ప్రసిద్ధి చెందినది.18 స్తంబాలపై శిల్పకళా నైపుణ్యం కొలువుతీరి ఇప్పటికీ చెక్కుచెదారకుండా భాశీల్లుతున్నది. ఇక్కడి శివలింగం స్వయంభువు డై వెలిసి, ఈ ఆలయంలో దేనుపూరీశ్వరుడిగా, పార్వతి దేవి దేనుపూరీశ్వరిగా /దేనుగంబల్ గా పూజలందుకుంటూ కొలువైవున్నారు.
ఒక దేనువుకు మోక్షం ఇవ్వటం వలన ఆ స్థలానికి దేనుపూరీశ్వరర్ గా ప్రఖ్యాతి చెందింది. స్థలపురాణానికి వెళ్తే "కపిలుడనే ముని తన ఎడమ చేతితో శివలింగాన్ని పూజించటం వలన శాపగ్రస్థుడై గోవుగా జన్మించాడు. పూర్వ జన్మ వాసనచే తన శాపమును గ్రహించి శాపమును తొలగించుకొన ప్రయత్నమున భూమియందు శివలింగం ఉన్నదని గ్రహించి తన పొదుగు యందు ఉన్న పాలధారాలను భూమిపై విడువసాగేను. ఆ గోవు యొక్క యజమాని చూసి పాలను వృధా చేయుచున్నదని తలంచి ఆ గోవును హింసించెను, అప్పుడు ఆ పరమేశ్వరుడే ప్రత్యక్ష మై, ఆ దేనువుకు మోక్షం ప్రసాదించి,ఆ గోవుయొక్క యజమానిని క్షమించి,తరువాత ఆ రాజ్యము యొక్క మహారాజుకు స్వప్నమునందు కనిపించి, ఆలయం కట్టమని ఆదేశించెను, శివాజ్ఞ మేరకు భూమినుంచి శివలింగం వెలికి తీసి, అక్కడ ఆలయం నిర్మింపచేసి, స్థలంపురాణా దృష్ట్యా ఆ ఆలయమునకు దేనుపూరేశ్వరర్ గా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ విశిష్టత ఏమనగా ఈశ్వరుడు తూర్పు వైపు కొలువై ఉండగా, అమ్మవారు దక్షిణ ముఖిగా దర్శనమిస్తారు.
*శివుని యొక్క శబ్ద ఉనికి*
పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.
శివుడు జననమరణాలుకు అతీతుడు.కాలతీతుడు అనగ కాలమునకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటాము. అంతయు శివుడే అందుకే అందరు దేవతలు శివారాధకులే.విష్ణువు, బ్రహ్మ, ఇతర దేవతలు సదా శివలింగారాధన చేస్తుంటారు.పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మ లకు కూడా అసంభవం.అందుకే పరమశివుడు అంటారు.
శివోహం